జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్‌ను విశేషంగా టెంట్ కింద నిర్వహించారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్థానిక పాఠశాల గదులు సరిపోయినన్ని లేకపోవడంతో టెంట్ కింద ఎన్నికల నిర్వహణ జరిగింది. గ్రామంలోని ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఎన్నికల అధికారులు తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసి పోలింగ్ బూతులను సిద్ధం చేశారు. ఒకే ప్రైమరీ పాఠశాలలో రెండు బూతులు, మిగతా 4 బూత్‌లను టెంట్ కింద ఏర్పాటు చేశారు.