మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్‌పై జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న మిస్టీరియస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన బ్రహ్మానందం మాట్లాడుతూ “దర్శకుడు మహి ఓ సస్పెన్స్ పెట్టి.. చివరి 20 నిమిషాలు అద్భుతంగా ఉండేలా సినిమా చేశారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు. దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఒక కొత్త స్క్రీన్‌ప్లేతో పూర్తిగా సస్పెన్స్‌తో వున్న ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుడిని ఆద్యంతం ఒక కొత్త అనుభూతికిలోను చేస్తుందని చెప్పారు. నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హీరో రోహిత్, సహ నిర్మాత ఉషా, శివానీ తదితరులు పాల్గొన్నారు.