మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో నాంపలి కోర్టు మంత్రిపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కెటిఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు గురువారం విచారణకు రాగా, మంత్రి గైర్హాజరును న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. కోర్టు ప్రొసీడింగ్స్‌కు సహకరించకుండా నిరంతరం గైర్హాజరవుతున్న తీరును సీరియస్‌గా తీసుకున్న న్యాయమూర్తి, ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు.
కాగా, నటి సమంత విడాకుల వ్యహరంలో కెటిఆర్‌ను ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిని తీవ్రంగా పరిగణించిన కెటిఆర్ మంత్రిపై క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, మంత్రి కొండా సురేఖపై న్యాయస్థానం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అవాస్తవమని మంత్రి కార్యాలయం ఓ ప్రకటలో వెల్లడించింది. ఫిబ్రవరి 5వ తేదీన హాజరు కావాలని మాత్రమే న్యాయస్థానం తెలిపిందని స్పష్టం చేసింది.