ఢిల్లీ: కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లున్నాయని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఎపిలో చంద్రబాబు నాయుడు అద్భుత పాలన సాగిస్తున్నారని అన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో.. ప్రాంతాల వారీగా పార్టీ ఎంపిలతో సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసిపిని ఇంకా టార్గెట్ చేయాలని బిజెపి ఎంపిలకు మోడీ సూచించారు. ఈ సందర్భంగా మోడీ మీడియాతో మాట్లాడుతూ.. టిడిపితో సమన్వయం బాగుందని, సోషల్ మీడియాలో మరింత చురుగ్గా వ్యవహరించాలని తెలియజేశారు. తెలంగాణలోనూ బిజెపి పార్టీ మరింత క్రియాశీకంగా..వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష పాత్రను మరింత సమర్థవంతంగా బిజెపి పోషించాలని, బిజెపి సోషల్ మీడియా కంటే.. అసదుద్దీన్ సోషల్ మీడియా బాగా పనిచేస్తోందని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు ఎక్కువగా చేరువవుతామని, సోషల్ మీడియా విషయంలో మరింత దృష్టి పెట్టాలని మోడీ స్పష్టం చేశారు.