హైదరాబాద్: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయి. 37,562 పోలింగ్ కేంద్రాలలలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు తర్వాత వార్డు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఉప సర్పంచ్ ను ఎన్నుకుంటారు.