హైదరాబాద్ :తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత పంచాయితీ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైయింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకే పోలింగ్ జరుగుతుంది. వరంగల్ జిల్లాలో అత్యధికంగా 61.21 శాతం, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 40.37 శాతం పోలింగ్ పోలింగ్ నమోదైంది. కాగా చాలా ప్రాంతాల్లో 60 శాతానికి పైగా పోలింగ్ జరిగినట్టు సమాచారం. కామారెడ్డిలో 53.31 శాతం పోలింగ్ నమోదైంది.