హైదరాబాద్ :తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత పంచాయితీ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైయింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకే పోలింగ్ జరుగుతుంది. వరంగల్ జిల్లాలో అత్యధికంగా 61.21 శాతం, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 40.37 శాతం పోలింగ్ పోలింగ్ నమోదైంది. కాగా చాలా ప్రాంతాల్లో 60 శాతానికి పైగా పోలింగ్ జరిగినట్టు సమాచారం. కామారెడ్డిలో 53.31 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినిగియోగించుకునేందుకు బారులు తీరారు. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నల్గొండ జిల్లా కోర్లపహాడ్, ఉరుమండ్ల గ్రామంలో ఘర్షణలు చెలరేగాయి. గజ్వేల్ మండలం అక్కారంలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. కారులో తరలిస్తున్న రూ. 2.25 లక్షలను పోలీసులు పట్టుకున్నారు.