గద్వాల్: జోగలాంబ గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 22.26 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినిగియోగించుకునేందుకు బారులు తీరారు. మొదటి విడతలో 106 గ్రామ పంచాయతీలకు గాను 91 గ్రామ పంచాయతీల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. గద్వాల, గట్టు, ధరూర్, కెటి దొడ్డి మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.