అమరావతి: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు వైఖరి వల్లే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కూటమి వచ్చాక తిరుమలలో అనేక ఘోరాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన స్వార్థం కోసం బాబు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. వాటిని డైవర్ట్ చేసేందుకే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకో మాట మాట్లాడటంలో డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ దిట్టని భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.