బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ’ఈషా’ పేరుతో ఓ హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని డిసెంబరు 25న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల్‌రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో తెరకెక్కిన ఈషా మూవీ ట్రైలర్ సక్సెస్ మీట్‌ను బుధవారంనాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ “కేవలం హారర్ మాత్రమే కాకుండా థ్రిల్లర్ మూవీ ఇది. సినిమా చూసినప్పుడు అందరూ కచ్చితంగా భయపడతారు”అని అన్నారు. బన్నీ వాస్ మాట్లాడుతూ “ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ‘ఈషా’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. దర్శకుడు శ్రీనివాస్ మన్నె మాట్లాడుతూ బన్నీ వాస్, వంశీ మా మూవీని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వంశీ నందిపాటి, త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి, హేమ వెంకటేశ్వర రావు, ఆర్‌ఆర్ ధృవన్, సంతోష్ పాల్గొన్నారు.