ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కల్పించిన ఓటు హక్కును ఎలాగైనా ఉపయోగించుకోవాలని 93 ఏళ్ల వృద్ధుడు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ఈ ఘటన ఇల్లంద పోలింగ్ కేంద్రంలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ పంచాయతీకి చెందిన మిట్టపల్లి తిరుపతిరెడ్డి అనే వృద్ధుడు గత కొంతకాలంగా అనారోగ్య బారినపడి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఈసారి కూడా తనకు కల్పించిన ఓటు హక్కును ఎలాగైనా ఉపయోగించుకోవాలని పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తన కుమారుల సహాయంతో కనీసం నడవలేని స్థితిలో కూడా ప్రత్యేక గొట్టాల ద్వారా ఆహారం తీసుకునే స్థితిలో స్టేచర్ నుంచి పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుని ఆనందపడ్డాడు.