అమరావతి: అల్లూరి జిల్లాలో హుకుంపేట మండలం రాళ్లగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా రహదారి కనిపించక వంతెనను కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గీతం కళాశాల విద్యార్థిగా పోలీసులు గుర్తించారు.