న్యూఢిల్లీ : లోక్‌సభలో బుధవారం సర్ అంశంపై అధికార , విపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయి వ్యా గ్యుద్ధం వేడివాడిని రగిల్చింది. హోం మంత్రి అమి త్‌షా , సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నడు మ సూటి పోటీ మాటలతో సర్‌పై వాదోపవాదాలు సాగాయి. శీతాకాల సమావేశాలలో తీవ్రమైన వేడి కి దారితీశాయి. సర్‌పై సభలో తలపెట్టిన చర్చతో ఇప్పుడు ప్రతిపక్షాలకు సంకట స్థితి ఏర్పడిందని అమిత్ షా తెలిపారు. దేశ ప్రధాని, రాష్ట్రాల ము ఖ్యమంత్రులు చొరబాటుదార్లు కావ డం ప్రతిపక్షాలకు ఇష్టమా అని ప్రశ్నించారు. చొరబాటుదార్లు అయిన వారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలిగించేందుకే సర్ ప్రక్రియను చేపట్టారు. ఇది ప్రతిపక్షాలకు రుచించడం లేదని ఎదురుదాడికి దిగారు. తప్పుడు పద్థతులు, చొరబాటుదార్ల ఓట్లతో గెలిచే కాంగ్రెస్ ఇతర విపక్షాల వారికి సర్‌తో అడ్డుకట్టపడింది. అందుకే వారు సర్‌ను వ్యతిరేకిస్తున్నారని వి మర్శించారు.
ఏది ఏమైనా ప్రతిపక్షాలు ఓడింది వారి నాయకత్వ లోపాలతోనే, వారికి ఉన్న బోలె డు మచ్చలు, కళంకిత చరిత్రతోనే అని వ్యాఖ్యానించారు. దీనికి వెంటనే రాహుల్ గాంధీ లేచి అభ్యంతరం తెలిపారు. తా ము చెపుతున్నది ఓట్ల చోరీ జరిగిందనేది, ఎన్నికల సంఘంతో కలిసి బిజెపి తన అధికారం , పలుకుబడితో తమకు అనుకూల ఓటర్లనే జాబితాల్లో ఉండేలా చేసుకుందని ఆరోపించారు. తాము చెపుతున్న ఓట్ల చోరీ అంశంపై అమిత్ షాకు ధైర్యం ఉంటే సభలో చర్చకు రాగల రా? అని సవాలు వి సిరారు. ఓట్ల చోరీపై తాను ప్రెస్‌మీట్ పెట్టి చెప్పిం ది, సాక్షాధారాలు చూపిం ది తమ బలీయమైన వాదనలో కోణం అని, దీనిపై చర్చకు వస్తారా? అని అమిత్ షాకు సవాలు విసిరారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ రాహుల్‌కు డొంకతిరుగుడు అలవాటు అని, అయినా ఆయన తాను మాట్లాడేది నిర్ణయించడానికి వీలులేదు. ముందు నేను చెప్పేది ఆయన వినాలి. ఈ ఓపిక ఉండాలని హితవు పలికారు.
నెహ్రూ ఇందిర సోనియాలే విలన్లు
దేశంలో ప్రధానంగా జరిగిన ఓటు చోరీలు మూడే అని,ఇది రాహుల్ గుర్తించి తీరాలని ఆమిత్‌షా చెప్పారు. ఒకటి స్వాతంత్య్రం తరువాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు 28 మంది మద్దతు ఉండగా, నెహ్రూ కేవలం ఇద్దరి మద్దతుతోనే ప్రధాని అయ్యారు. ఇది తొలి ఓటు చోరీ, తరువాత ఇందిరా గాంధీ తన ఎన్నిక చెల్లనేరదనే కోర్టు తీర్పు నుంచి తనకు తాను మినహాయంపు పొందడం రెండో ఓటు చెరీ ఇక మూడవ ఓటు చోరీ సోనియా గాంధీ దేశ పౌరురాలు కాకముందే ఓటరు కావడం, ఇది ఇప్పుడు కోర్టులో వ్యాజ్యానికి వచ్చిందని గుర్తు చేశారు. ఓటు చోరీని ఇవిఎంలు వచ్చి అడ్డుకున్నాయి. అందుకే వారి ఆటలు సాగడం లేదనే సర్‌పై వారికి మంట అన్నారు. పలు రాష్ట్రాలలో ప్రతిపక్షాల పరాజయానికి కారణం
కేవలం వారి నాయకత్వ లోపమే అన్నారు. దీనికి ఓట్ల యంత్రాలను నిందించి లాభం ఉంటుందా? యంత్రాలతో ఓట్లు రాలుతాయా? అని ప్రశ్నించారు. బీహార్‌లో ప్రతిపక్ష నేత ఏకంగా చొరబాటుదార్ల రక్షణ యాత్రను చేపట్టారు. వారిని ఓటర్ల జాబితాల నుంచి తొలిగించరాదని వితండవాదానికి దిగారని విమర్శించారు. ఈ దశలోనే తాము (ఎన్‌డిఎ) బీహార్‌లో మూడింట రెండొంతుల మెజార్టీతో బ్రహ్మండంగా గెలిచామని తెలిపారు. వారు ఓడితే ఇసిని నిందించడం పరిపాటి అయింది. ఓటర్ల జాబితాలపై ఆడిపోసుకోవడం అలవాటు అయింది. ఇది మంచిది కాదన్నారు. ఓట్ల చోరీ ఒక్కటే కాదు దేనిపై అయినా చర్చకు బిజెపిఎన్‌డిఎ ఎప్పుడూ పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం , వెనుకకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.