కమెడియన్ సత్య, మత్తు వదలర ఫేమ్ రితేశ్ రానా దర్శకత్వంలో ‘జెట్‌లీ’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి తాజాగా ఓ సూపర్ అప్‌డేట్‌ని విడుదల చేశారు. ‘మిస్ యూనివర్స్ ఇండియా-2024’ రియా సంఘా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అందుకు సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. యాక్షన్ ప్రాధాన్యమున్న పాత్రలో రియా నటిస్తోందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో శివానీ రాయ్‌గా సందడి చేయనుంది.
గుజరాత్‌కు చెందిన రియా.. 18 ఏళ్ల వయసులోనే ‘మిస్ యూనివర్స్ ఇండియా-2024’ టైటిల్‌ను గెలుచుకుంది. అంతకు ముందు ఏడాదిలో ‘మిస్ టీన్ గుజరాత్, ‘మిస్ టీన్ ఎర్త్’ కిరీటాలు దక్కించుకుంది. మిస్ టీన్ గుజరాత్ గెలిచిన తొలి గుజరాతీ అమ్మాయి రియానే కావడం విశేషం. ‘మిస్ యూనివర్స్-2024’ టాప్ 30లో నిలిచింది.
Miss Universe India in a Universal Telugu cinema 👸❤️🔥
Introducing #RheaSingha, landing from the world of #JETLEE ✈️
Wishing the Amazing and Gorgeous Rhea a very Happy Birthday 🥳
A @RiteshRana‘s turbulence 🛫
Starring #Satya, #RheaSingha, @vennelakishore
Produced by… pic.twitter.com/1h0pYj6I6T— Mythri Movie Makers (@MythriOfficial) December 10, 2025