ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల్లో ఒకే వ్యక్తి గురించి చర్చ జరుగుతోంది. అతడే సంజూ శాంసన్. ఓపెనర్‌గా శుభ్‌మాన్ గిల్ తిరిగి రావడంతో జట్టులో సంజూ స్థానం గల్లంతైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గోా జితేశ్ శర్మని తీసుకున్నారు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటంగ్‌కి వచ్చిన జితేశ్ 5 బంతుల్లో 1 సిక్సుతో 10 పరుగులు చేశాడు. దీంతో ఒక ఫినిషర్‌గా తన టాలెంట్‌ని నిరూపించుకున్నాడు. దీంతో సంజూ బదులు జితేశ్‌కే మొగ్గు చూపిస్తుంది టీమ్ మేనేజ్‌మెంట్. ఈ విషయంపై జితేశ్ స్పందించాడు. సంజూ తనకు పెద్దన్న లాంటి వాడని అన్నాడు.
‘‘ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే మనలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుంది.. జట్టుకు కూడా అదే మంచిది. భారత్‌లో టాలెంట్‌కి కొదవలేదు. సంజూ భయ్యా గొప్ప ప్లేయర్. ఆయనతో నేను పోటీ పడాల్సి ఉంటుంది. అప్పుడే నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలుగుతాను. మేము ఇద్దం భారత్‌కు ఆడాలనే కోరుకుంటాం. మేము ఇద్దరం సోదరుల వంటి వాళ్లం. మా అనుభవాలను పరస్పరం పంచుకుంటాం. నాకు సంజూ ఎంతో సాయం చేశాడు. సలహాలు ఇస్తాడు. ఒకవేళ అతడితోనే నాకు పోటీ అంటే బెస్ట్ ఇచ్చి ఢీకొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను’’ అని జితేశ్ పేర్కొన్నాడు.