విక్టరీ వెంకటేశ్ తన అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వెంకటేశ్ ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ఫిలీం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబోలో సినిమా వస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. బుధవారం ఈ మూవీ టైటిల్ తోపాటు ఫస్టు లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు ఆదర్శ కుటుంబం అనే టైటిల్ ను ఖరారు చేశారు. ‘హౌస్ నెం.47-ఎకె 47’ అనేది ట్యాగ్ లైన్. పోస్టర్ లో వెంకటేషన్, చేతిలో ఆఫీస్ బ్యాగ్ పట్టుకుని రోడ్డుపై నిల్చొని పైకి చూస్తూ నవ్వుతూ కనిపించాడు. పోస్టర్ ను చూస్తుంటే మంచి కామెడీతోపాటు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈరోజు షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను హారికా అండ్ హాసినీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై చిన్నబాబు(రాధాకృష్ణ) నిర్మిస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు.