తెలంగాణలో బుధవారం తెల్లవారుజామున రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం తరోడ సమీపంలో తెల్లవారుజామున ఓ కారు బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు
అలాగే,కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామంలో ఆటో బోల్తా కొట్టింది. ఉదయం పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఒకురు చనిపోయారు. మరో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిని వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.