ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన బుధవారం మండలంలోని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఏఎస్‌ఐ.మనోహర్ రావు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన అల్లాపురం లింగయ్య (59) అనే రైతు గ్రామ శివారు లో గల తన పంట పొలంలో వరి నారుమడికి నీళ్లు పారపెట్టడానికి విద్యుత్ శాఖ గురై మృతి ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపారు. వరి నారుమడి పందుల రక్షణ కొరకై తుకం చుట్టు జియో వైరుకు కరెంట్ షాక్ పెట్టాడు.ప్రమాదవశాత్తున కరెంట్ షాక్ తగలడంతో కుడి కాలుకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వెళ్లి చూసేసరికి నిజంగానే అల్లపురం లింగయ్య చనిపోయి ఉన్నాడు.భార్య అల్లపురం లక్ష్మవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఏఎస్‌ఐ మనోహర్ రావు తెలిపారు.మృతునికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు.