రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమాలో డింపుల్ హయాతి, అషిక రంగనాథ్ హీరోయిన్లు. ఇప్పటికే టైటిల్ ప్రకటనలతో పాటు తొలి సింగిల్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. తాజాగా ‘అద్దం ముందు’ అంటూ సాగే మెలోడి పాటని విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రవితేజ, డింపుల్ హయాతిలు స్టెప్పులేశారు. ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యం అందించగా.. శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ పాడారు. భీమ్స్ సంగీతం అందించారు. రవితేజా అభిమానులనే కాదు.. సంగీత ప్రియులను ఈ పాట ఉంది. ఇక సినిమా విషయానికొస్తే.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.