కొత్తగూడ మండలంలోని గోపాలపురం గ్రామంలో బుధవారం మొక్కజొన్న సోప్పకు నిప్పు పెట్టిన వ్యక్తి చిన్న సమ్మయ్య ప్రమాదవశత్తు మంటల్లో పడి మృతి చెందాడు,వివరాలు ఇలాఉన్నాయి..కొత్తగూడ మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన రైతు చిన్న సమ్మయ్య మొక్కజొన్న చొప్ప తలగబెడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి తురుష చిన్న సమ్మయ్య సజీవ దహనం అయ్యాడు.చిన్న ఎంతటికి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ పొలం వద్దకు వెళ్లి చూడగా మంటల్లో సజీవ దహనమైన మృతదేహాం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంత ప్రజలందరూ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని కంట తడి పెట్టారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాంను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.