హైదరాబాద్: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమాకి సీక్వెల్‌గా ‘అఖండ-2’ సినిమాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకి గురయ్యారు. సమస్యలన్నీ తొలగిపోవడంతో ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 11న ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది.
‘అఖంఢ-2’ విడుదల తేదీ ప్రకటించడంతో చిన్న సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే డిసెంబర్ 12న మోగ్లీ, సఃకుటుంబానాం తదితర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, అఖండ-2 ఆ రోజే రావడంతో ఈ సినిమాలు వెనకడుగు వేయాల్సి ఉంటుంది. మరి ఈ విషయంపై స్పష్టత రావాలి అంటే.. వేచి చూడాలి. ఇక 2021లో వచ్చి అఖండ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సంయుక్త, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.