పసిడి వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. ఇటీవల తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం మరోసారి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధరపై రూ. 870 పెరిగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరిగింది. ఇక, కిలో వెండిపై రూ.8 వేలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,30,310 చేరుకోగా.. 22 క్యారెట్ల 10 బంగారం రూ.1,19,450కు పెరిగింది. ఇక, కిలో వెండి రూ.2,07,000కు చేరింది.