సంగారెడ్డి: ప్రేమ వ్యవహారంలో బీటెక్ విద్యార్థిపై దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరు మధ్య గత కొన్ని రోజులు ప్రేమ వ్యవహారం నడిచింది. హాస్టల్‌లో శ్రవణ్ సాయిని యువతి బంధువులు పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. గత సంవత్సరం నుంచి యువతికి దూరంగా ఉన్నానని చెప్పాడు. కోపంతో రగిలిపోయి యువతి కుటుంబ సభ్యులు బ్యాట్ తీసుకొని కొట్టడంతో కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందాడని తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ విజయారావు తెలిపారు.