అమరావతి: ఫోన్ ఎక్కువగా మాట్లాడవద్దని చెప్పినందుకు భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేడూరులో రాజారావు అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుండడంతో భార్యను పలుమార్లు భర్త మందలించాడు. ఫోన్ కాల్ విషయంలో దంపతులు మధ్య గొడవ జరుగుతోంది. అదునుచూసి భర్తపై గొడ్డలితో భార్య దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన భర్తను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.