తిరువనంతపురం: ఓ యువతిని కొట్టి చంపిన కేసులో పోలీసులు ప్రియుడ్ని పట్టుకొని విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన కేరళలోని మలయత్తూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముడంగమట్టంలోని తిరుతిపరంబిల్ ప్రాంతానికి చెందిన షైజు-షిని అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు చిత్రప్రియ అనే కూతురు ఉంది. మలయాత్తురులోని ఓ పాతబడిని భవనంలో ఆమె మృతదేహం కనిపించింది. తలపై బలమైన గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమె ప్రియుడు అలాన్‌పై అనుమానాలు రావడంతో అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ప్రియురాలు కుటుంబ సభ్యులు దాడి చేసే అవకాశం ఉండడంతో ప్రియుడి కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించారు. చిత్రప్రియతో అలాన్ బైక్‌పై ప్రయాణించినట్టు సిసి కెమెరాలతో రికార్డు కావడంతో అనుమానాలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.