ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా వర్సిటీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి ఓయూను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సర్వం సిద్ధం పేరుతో సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సభలో సిఎం రేవంత్ ప్రసంగించనున్నారు. కాగా, వర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు ప్రకటించింది. ఇటీవల సిఎం మాట్లాడుతూ.. ఓయూను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో వర్సిటీ డీపీఆర్ రెడీ చేస్తోంది. కాగా, సిఎం రేవంత్ రెడ్డి.. ఓయూకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి సిఎం హోదాలో రేవంత్ ఓయూకు వెళ్లారు.