ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్ర ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండురోజుల పాటు జరిగిన గ్లోబల్ సమ్మిట్‌పై అధిష్టానానికి సిఎం నివేదిక ఇవ్వనున్నట్టుగా తెలిసింది. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో కేంద్రమంత్రులను సైతం సిఎం రేవంత్‌రెడ్డి కలిసే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులను ఇవ్వాలని ఆయన కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.