నివాసాల్లోకి వచ్చి స్థానికులపై చిరుత దాడి చేసిన సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో చోటుచేసుకుంది. చిరుత దాడిలో ఏడుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది రెండు గంటలకు పై శ్రమించి చిరుతకు మత్తు మందు ఇచ్చి బోనులో బంధించారు.ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.