అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండో స్థానానికి చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో పాటు ఓ అజేయ హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకున్నాడు. ఇంతకుముందు నాలుగో స్థానంలో ఉన్న కోహ్లి తాజా ర్యాంకింగ్స్‌లో 773 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. భారత్‌కే చెందిన రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. రోహిత్ 781 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అతనికి కోహ్లి నుంచి గట్టి పోటీ నెలకొంది. రానున్న న్యూజిలాండ్ సిరీస్‌లో కోహ్లి టాప్ ర్యాంక్‌ను అందుకున్న ఆశ్చర్యం లేదు. డారిల్ మిఛెల్ (కివీస్) మూడో, ఇబ్రహీం జద్రాన్ (అఫ్గాన్) నాలుగో, గిల్ (భారత్) ఐదో ర్యాంక్‌లో నిలిచారు.