గురువును దైవంలా భావించాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ, ఈ వ్యక్తులు మాత్రం తమకు అవకాశం కల్పించలేనదని గురువుపై తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన తమిళనాడులోని పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ అండర్-19 కోచ్ ఎస్.వెంకటరమణ్‌పై ముగ్గురు ఆటగాళ్లు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో వెంకట రమణకు తీవ్ర గాయాలయ్యయి. ఆయన నుదుటిపై 20 కుట్లు పడ్డాయి. భజం విరిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమకు అవకాశం కల్పించనందుకే ఆ ఆటగాళ్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ విషయంపై ఎఫ్.ఎ.ఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘వెంకటరమణ్ నుదుటిపై 20 కుట్లు పడ్డాయి. భుజం విరిగింది. కానీ, ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉంది. దాడికి పాల్పడిన ఆటగాళ్లు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నాము. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ తీఅని సిఐ రాజేశ్ తెలిపారు.