రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి షాద్ నగర్ లో ఓ రేషన్ డీలర్ వద్ద 20వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై విభాగంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీగా పనిచేస్తున్న రవీందర్ నాయక్ ఇక్కడి ప్రాంతంలో వర్షం డీలర్ వద్ద డబ్బులు డిమాండ్ చేయగా అతను ఏసిబి అధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది. అయితే వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని అతని కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎవరు ఆ రేషన్ డీలర్ ఎందుకు పట్టించారు, ప్రస్తుతం రవీందర్ నాయక్ వద్ద ఇంకా ఎలాంటి విషయాలను ఎసిబి అధికారులు విచారిస్తున్నారు అన్న సమాచారం రావాల్సి ఉంది.