మృతుల్లో నలుగురు పర్యాటకులు
మిగతావారంతా సిబ్బందే
గోవాలో ఘోర విషాదం
పనాజీ: గోవా ఉత్తరప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి ఉత్సాహంగా సాగుతున్న నృత్యకార్యక్రమం సందర్భంగా జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. 25మంది మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలోని అర్పోరా వద్ద ఉన్న బిర్చ్ బై రో మియో లేన్ నైట్ క్లబ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్ర మాదం జరిగింది. బయటకు వెళ్లే మార్గాలు ఇరు గ్గా ఉండడంతో బాధితులు చిక్కుకుపోయారు. ఎక్కువ మంది ఊపిరాడక చనిపోయినట్లు అగ్నిమాపక దళం అధికారి తెలిపారు. మరణించిన వారిలో నలుగురు టూరిస్ట్‌లు, 14మంది క్లబ్ సిబ్బంది ఉన్నారు. ఇంకా ఏడుగురిని గుర్తించవలసి ఉందని పోలీసులు తెలిపారు. క్లబ్ భవనం అనధికారికంగా నిర్మించిన కట్టడం. భద్రతా నిబంధనలను ఉల్లంఘించినా పట్టించుకోకుండా క్లబ్ నిర్వహణకు అనుమతినిచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హెచ్చరించారు.
క్లబ్ మొదటి అంతస్తులో మొదట మంటలు చెలరేగాయని, రద్దీ, బయటుకు వెళ్లే తలుపులు చిన్నగా ఉండడంతో బాధితులు బయటకు వెళ్లలేకపోయారని ప్రాథమిక విచారణలో తేలింది. కొందరు గ్రౌండ్ ఫ్లోర్ కి పరిగెత్తుకువెళ్లినా అక్కడ చిక్కుకు పోయారని ముఖ్యమంత్రి సావంత్ తెలిపారు. నైట్ క్లబ్ య జమాని, జనరల్ మేనేజర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేస్తామని సీఎం తెలిపారు. క్లబ్ య జమానితో పాటు, నిబంధనలు ఉల్లంఘించినా, క్లబ్ నిర్వహణకు అనుమతినిచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపా రు. టూరిస్ట్ సీజన్ సమయంలో ఇలాంటి సం ఘటన జరగడం దురదృష్టకరమని ముఖ్యమం త్రి తెలిపారు. మెజిస్టేట్ ఎంక్వయిరీకి ఆదేశించి దోషులను శిక్షిస్తామన్నారు. క్లబ్‌లో జరిగిన ప్ర మాదంలో పలువురి మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని మోదీ దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. క్లబ్‌ను సౌరవ్ లూ త్రా నడుపుతున్నారని అర్పోరా- నాగో వా పంచాయతి సర్పంచ్ రోషన్ రెడ్కర్ తెలిపారు. క్లబ్ నిర్మాణానికి అనుమతి లేదని, కూల్చివేతకు పంచాయతీ నోటీసులు జారీ చేసినా పంచాయతీ డైరెక్టరేట్ అధికారులు ఆ నోటీసులను నిలిపివేశారని సర్పంచ్ రెడ్కర్ చెప్పారు.
నైట్ క్లబ్ యజామూనులపై కేసు, సర్పంచ్ నిర్బంధం
గోవాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ యజమానులు సౌరభ్ లూత్రా తో పాటు, క్లబ్ మేనేజర్ పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. క్లబ్ కు గతంలో అనుమతిచ్చిన అర్పొరా- నాగోవా పంచాయతి సర్పంచ్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడం, బయటకు వెళ్లే మార్గం ఇరుగ్గా ఉండడం, డాన్స్ వేదిక వద్ద భారీ రద్దీ కారణంగా క్లబ్ ప్రాణాంతకంగా మారింది.