న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, పంజాబ్ మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూపై కాంగ్రెస్ వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల పార్టీపై నవజ్యోత్ కౌర్ సిద్ధూ సంచలన ఆరోపణలు చేసింది.
ఇటీవల నవజ్యోత్ సింగ్ సిద్ధూ క్రియాశీల రాజకీయాలకు తిరిగి రావడంపై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. కాంగ్రెస్ 2027కి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తేనే ఆయన మళ్లీ పోటీ చేస్తారని చెప్పారు. రూ.500 కోట్లు సూట్ కేసు ఇచ్చేవారే ముఖ్యమంత్రి అవుతారని..ఆ పదవిని కొనడానికి అంత డబ్బు తమ వద్ద లేవని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు పార్టీలో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆమెను ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు.