రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 2047కు తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీని చేరుకోవాలని ఆశిస్తున్నానని.. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని గవర్నర్ అన్నారు.
కాగా, సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతోపాటు కర్నాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, దేశ విదేశీ కంపెనీ ప్రతినిధులు, పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమ్మిట్ ప్రారంభానికి ముందు తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని సిఎం రేవంత్ ఆవిష్కరించారు.