విశాఖపట్నం: సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో ఘోర పరాజయం పాలైన భారత్‌కు వన్డేల్లో గెలుపు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. రానున్న టి20 సిరీస్‌లోమరింత మెరుగ్గా బరిలోకి దిగేందుకు ఇది దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పరుగుల వరద పారిన సిరీస్‌లో ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. టీమిండియా సీనియర్ బౌలర్ విరాట్ కోహ్లి వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు బాదాడు. అంతేగాక విశాఖలో జరిగిన మూడో మ్యాచ్‌లో అజేయ అర్ధ సెంచరీతో అలరించాడు. మరో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా సిరీస్‌లో అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలకమైన మూడో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి పోయాడు.
కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా రెండు మ్యాచుల్లో అర్ధ సెంచరీలతోఆకట్టుకున్నాడు. ఇక సీనియర్లు రోహిత్, కోహ్లిల బ్యాటింగ్‌ను ఎంత పొగిడినా తక్కువే. ఇద్దరు అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సఫారీ సిరీస్‌లో రాణించడం ద్వారా సీనియర్లు జట్టులో స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అంతేగాక వచ్చే వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు సంపాదించేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.