విశాఖపట్నం: సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ని భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డేలో నెగ్గి సిరీస్‌ని 2-1 తేడాతో దక్కించుకుంది. ఇక మూడో మ్యాచ్ గెలిచి తిరిగి హోటల్‌కి వచ్చిన టిం ఇండియా సభ్యులు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. తొలుత కేక్ కట్ చేయడానికి తొలత ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ విరాట్ కోహ్లీ ముందుకు వచ్చాడు. కానీ, అతడు వెంటనే తన వెనక ఉన్న ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ యశస్వి జైస్వాల్‌ను గమనించాడు. వెంటనే కోహ్లీ.. జైస్వాల్‌ని పిలిచి కేక్ కట్ చేయమని చెప్పాడు. జైస్వాల్ కేక్ కట్ చేసి ఓ చిన్న ముక్కని విరాట్‌కి తినిపించాడు.
అక్కడే ఉన్న రోహిత్ శర్మకి కేక్ పెట్టబోదే.. రోహిత్ ఓ ఫన్నీ డైలాగ్ అన్నాడు. ‘‘మళ్లీ లావైపోతా.. నాకొద్దు’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. టెస్ట్, టి20 ఫార్మాట్‌ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేల్లో కొనసాగుతున్నాడు. 2027లో జరిగే ప్రపంచకప్‌లో ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం రోహిత్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. కఠినమైన డైట్ ఫాలో అవుతూ.. ఏకంగా 10 కిలోలు తగ్గాడు.