హైదరాబాద్: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల పేరుతో వృద్ధురాలు కుర్రె లక్ష్మి ని ఆమె కొడుకులు నమ్మించి జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ముందు వదిలేశారు. వృద్ధురాలు రోజంతా చలికి వణికిపోతూ ఎదురుచూసింది. ఇది గమనించి వృద్ధురాలి దయనీయ పరిస్థితిని చూసి స్థానికులు చలించి పోయారు. ఆమె తాలూఖ వివరాలు తెలుసుకుని..ఆర్డీవొ మధుకర్ స్పందించి, వెంటనే పెద్ద కొడుకు కృష్ణకు ఫోన్ చేసి, తల్లిని తీసుకెళ్లాలని, సోమవారం ఇద్దరు కొడుకులు కార్యాలయానికి హాజరు కావాలని ఆర్డీవొ మధుకర్ ఆదేశించారు.