వైజాగ్: సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. విశాఖ స్టేడియం వేదికగా జరిగిన మూడో, కీలక వన్డేలో యువ క్రికెటర్ యశస్వి జైసాల్ అద్భుతంగా రాణించాడు. తొలి రెండు వన్డేల్లో విఫలమైనా.. మూడో మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయాడు. సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తొలి వికెట్‌కి రోహిత్ శర్మతో కలిసి 155 పరుగులు జోడించిన యశస్వి.. జట్టు విజయాన్ని సులభతరం చేశాడు. ఈ క్రమంలో తన క్రికెట్ కెరీర్‌లో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
భారత క్రికెట్ చరిత్రలో మూడు ఫార్మాట్‌లలో(టెస్టు, వన్డే, టి-20) సెంచరీలు సాధించిన ఆరో బ్యాటర్‌గా అతడు రికార్డు సాధించాడు. యశస్వి కెరీర్‌లో ఇది నాలుగో వన్డే మాత్రమే. అంతకు ముందు టెస్టు, టి-20 ఫార్మాట్‌లలో సెంచరీలు సాధించిన ఈ యువ క్రికెటర్ తాజాగా వన్డేల్లోనూ సెంచరీ చేశాడు. దీంతో దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సురేశ్ రైనా, శుభ్‌మాన్ గిల్‌ల సరసన చోటు దక్కించుకున్నాడు. దీంతో భవిష్యత్‌లో భారత క్రికెట్‌కు తానేంటో నిరూపించుకున్నాడు.
ఇక శనివారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 270 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. జైస్వాల్ సెంచరీ, రోహిత్, విరాట్‌లు హాఫ్ సెంచరీలు చేయడంతో 39.5 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పాయి భారత్ సునాయాస విజయం సాధించింది.