తిరుపతి: చిల్లకూరు జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రైటర్ సత్రం వద్ద శౌర్యన్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సులో 35 మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. గుంటూరు నుండి శబరిమలకు బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.