వాషింగ్టన్: అమెరికాలో తెలుగువాళ్లు తమ సత్తా చాటారని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్ కు ఎపి బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని అన్నారు. డాలస్ లో లోకేష్ పర్యటించారు. తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలను ఉల్లంఘించిన వారిని ఎవరినీ వదిలిపెట్టమని, విలువలతో కూడిన భారత్ తోనే వికసిత్ భారత్ సాధ్యమని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని లోకేష్ తెలియజేశారు. వైసిపి వైనాట్ 175 అంటే.. ప్రజలు వైనాట్ 11 అని అన్నారని, చట్టాలను ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టమని, తల్లిని అవమానించే వారిని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. వాళ్లు చేసిన తప్పులు మనం చేయకూడదని, రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని లోకేష్ పేర్కొన్నారు.