మన తెలంగాణ/హైదరాబాద్: గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తు న్నామని బిజెపి చీఫ్ ఎన్.రామచంద్రరావు అన్నారు. సోమవారం గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని, తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందాలని బిజెపి పార్టీ ఆకాంక్షిస్తుందని వెల్లడించారు. వికసిత్ భారత్ -2047 లక్ష్యంగా మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అన్ని రాష్ట్రాలు సమగ్రాభివృద్ధి అయ్యేందుకు అవసరమైన ప్రణాళికలను కేంద్రం రూపొం దిస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తోందన్నారు.