స్టార్ హీరో కార్తి నటిస్తున్న మూవీ ‘అన్నగారు వస్తారు‘ ఈ నెల 12న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా ‘అన్నగారు వస్తారు‘ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ థియేటర్స్‌లో సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించిందని హరీశ్ శంకర్ ప్రశంసిస్తూ.. ‘అన్నగారు వస్తారు‘ సినిమా టీమ్‌కు తన బెస్ట్ విషెస్ అందించారు. ఇక కార్తి నటన, కామెడీ, యాక్షన్, రొమాన్స్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది.