మన తెలంగాణ/ఉమ్మడి నల్లగొండ బ్యూరో: ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు అవసరమైనన్నీ నిధులు కేటాయించి, తమ పార్టీ హయాంలోనే పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్ప ష్టం చేశారు. నల్లగొండ జిల్లా, దేవరకొండలో ప్రజాపాలన ప్ర జావిజయోత్సవాల సభ శనివారం జరిగింది. ఈ సభకు ము ఖ్యఅతిథిగా హాజరైన సిఎం మాట్లాడుతూ..ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ కాంగ్రెస్ హయాంలో ముందుకు తీసుకుపోతే పది కిలోమీటర్లు మిగిలిఉంటే బిఆర్‌ఎస్ పాలనలో ఏమాత్రం పనులు చేయలేదన్నారు. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో ప్రమాదం జరిగి ఎనిమిది మంది చనిపోతే బిఆర్‌ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందారని, మామ, అల్లుళ్ళు డ్యాన్సులు చేశారని ఎద్దేవా చేశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ‘కెసిఆర్.. నువ్వు.. నీ కొడుకు.. నీ బిడ్డ.. నీ అల్లుడు తెలంగాణను పీక్క తిన్నారు.. పదేళ్ళలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేస్రిండు.. అయినా తెలంగాణపై మీ ఆశ తీరలేదా?’ అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్‌కు మంచి రోజులు రావు.. బిడ్డ, కొడుకు, అల్లుడు పార్టీని ముంచేరోజులు వస్తాయి అని వ్యాఖ్యానించారు. ‘ఆ పార్టీకి కెటిఆర్ గుదిబండలా మారాడు..గులాబీ పార్టీని బొందపెట్టడానికి నీ కొడుకుచాలు..
కెటిఆర్ ఉన్నంతకాలం నీ పని అంతే.. కెసిఆర్.. బిఆర్‌ఎస్ పనే ఖతం..’ అని అన్నారు. పదేళ్ళ తెలంగాణను పట్టిపీడించిన గడీల పాలనను ఓటే ఆయుధంగా మార్చి కుప్పకూల్చి ఇందిరమ్మ రాజ్యం తెచ్చామని అన్నారు. ప్రజాపాలనలో ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోతున్నామని చెప్పారు. ‘పదేళ్ళు నష్టపోయాం.. పదేళ్ళు కష్టపడ్డాం.. అందరి కష్టంతో అధికారంలోకి వచ్చాం.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది’ అని చెప్పారు. దేశంలోనే తెలంగాణను నెంబర్‌వన్‌గా మార్చి తెలంగాణ మోడల్ దేశవ్యాప్తం చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధికి రెండు కళ్ళు అని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదని, కనీసం కార్డులో పేరు మార్చలేదన్నారు. దేశంలో పేదలకు సన్నబియ్యం తెలంగాణలో మాత్రమే ఇస్తున్నామని చెప్పారు.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకుఇవ్వడం లేదో చెప్పాలి?
బిజెపి పాలిత, ఎంపి, యుపి, రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలన్నారు. ‘ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన చోట మేం ఓట్లు అడుగుతాం.. డబుల్ బెడ్‌రూం ఇళ్ళు ఇచ్చినచోట కేసిఆర్ ఓట్లు అడగాలి’ అని అన్నారు. తెలంగాణలో పేదలకు ఇళ్ళు ఇవ్వలేని మాజీ సిఎం కెసిఆర్ రెండు వేల కోట్లతో గడీ కట్టుకున్నారని ఆరోపించారు. 2004 నుండి 2014 వరకు 22 లక్షల ఇళ్ళు రాష్ట్రంలో ఇచ్చామని చెప్పారు. ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు. రాష్ట్రమంతా కరెంట్ ఇస్తున్నామని, కెసిఆర్ ఇంట్లో మాత్రమే కరెంట్ లేదని, ఫీజు, స్టార్టర్‌ను ప్రజలు కట్ చేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
దేవరకొండ అభివృద్ధికి నిధులు..
దేవరకొండ అభివృద్ధికి నిధుల వరద పారిందని, నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. దేవరకొండ అభివృద్ధి బాధ్యత మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌లకు అప్పగిస్తున్నానని, వారు దేవరకొండకు వచ్చి రివ్యూ పెట్టి చర్చిస్తారని చెప్పారు.
అభివృద్ధి చేసేటోళ్ళను సర్పంచ్‌లుగా ఎన్నుకోండి
మంత్రులతో కలిసి ఉండెటోళ్ళు.. ఎంఎల్‌ఎలతో కలిసి పనిచేసే వాళ్ళను సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉన్నోళ్ళకు అవకాశం కల్పించాలని కో రారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఇందిరమ్మ చీరలు ఇం టికే పంపిస్తానని చెప్పారు. చీర కట్టుకోండి.. సర్పంచ్‌కు ఓ టేయండన్నారు. ఈ సభలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం, ఎంఎల్‌లు బా లునాయక్, బిఎల్‌ఆర్ తదితరులు హాజరయ్యారు. అంతకుముందు 20 కోట్ల రూపాయలతో దేవరకొండ పట్టణంలో అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. మెప్మా మహిళా సంఘాలకు 11.33 కోట్ల రూపాయల లింకేజీ రుణాలు పంపిణీ చేశారు.