మన తెలంగాణ/హైదరాబాద్ : భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 202 5కు దేశ, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సం స్థల ప్రతినిధులు తరలిరానున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్లో రెండు రోజులపాటు మొత్తం 27 ప్ర త్యేక ప్యానల్ చర్చలు జ రుగుతాయి. ప్యానల్ చర్చల్లో భాగంగా ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ- సెమీకండక్ట ర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బ న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమ లు, మ హిళా వ్యాపారవేత్తల ప్రోత్సా హాం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షే మం, స్టార్టఫ్‌లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉ ం టా యి. వరల్డ్ హెల్త్ ఆర్డనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యూనిసెఫ్ ప్రతినిధుల తో పాటు తేరి, బిసిజి, మైక్రాన్ ఇండి యా, హిటాచ్చీ ఎనర్జీ, ఓ2 పవర్, గ్రీన్ కో, అపో లో హాస్పిటల్స్, ఐఐటి హైదరాబాద్, నాస్‌కాం, సాప్రాన్, డిఆర్‌డిఓ, స్కై రూట్, ధృవ స్పేస్, అ మూల్, లావుర స్ ల్యాబ్స్, జిఎంఆర్, టాటా రియాల్టీ, కోటాక్ బ్యాంక్, గోల్డ్‌మ్యాన్ సాచ్స్, బ్లాక్‌స్టోన్, డిలైట్, క్యాపిటల్ ల్యాండ్, స్విగ్గీ, ఏడబ్లూఎస్, రెడ్. హె ల్త్, పివిఆర్ ఇనోక్స్, సిక్యా ఎంటర్‌టైన్‌మెంట్, తాజ్ హోటల్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
చర్చల్లో పాల్గొననున్న సినీ ప్రముఖులు
పివి సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వం టి క్రీడా ప్రముఖులు ఒలంపిక్ గోల్డ్ క్వీ స్ట్ సెషన్‌లో పాల్గొంటారు. రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా వంటి సినీ ప్రముఖులు క్రియేటివ్ సెంచరీ సాఫ్ట్ ప వర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ చర్చలో పా ల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు సదస్సుకు తరలివచ్చే ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటారు. దావోస్‌లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ను తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో ఈ సద స్సు జరగాలని ముఖ్యమంత్రి స్వయంగా ఈ సదస్సు ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తున్నారు. అధికారులతో ఇప్పటికే ప లుమార్లు సమావేశాలు నిర్వహించారు.
ఈ సదస్సు వేదికలో రెండో రోజున డి సెంబర్ 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యమెంట్ ను ఆవిష్కరిస్తుంది. 2047 నాటికి రా ష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్‌ను ఈ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అన్ని రంగాల్లో భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికలను పొందు పరిచారు.