మన తెలంగాణ/హైదరాబాద్: లక్ష కోట్లు లక్షం గా రాష్ట్రం ప్రభుత్వం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్‌ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఫ్యూచర్ సిటీ లో ఏ రంగంలోనైనా సరే పెట్టుబడులు పెట్టేలా పె ట్టుబడిదారులను తెలంగాణ ప్రభుత్వం ఆకర్షిస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మక కార్యాచరణను అమలు చేస్తోంది. దాదాపు 3 నెలల పాటు కసర త్తు చేసిన రూపొందించిన ఫ్యూచర్ సిటీ 4.0 ఫా ర్ములాను ప్రపంచం ముందు ఆవిష్కరించనుంది. డిసెంబరు 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగా ణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2047కు అనేక మంది ప్రముఖులు తరలి రానున్నారు. అనేక పరిశ్రమల అధినేతలతో పాటు ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లను తెలంగాణ ప్రభుత్వం ఒకే వేదికపైకి తీసుకురానుంది. సదస్సుకు 4,800 మందికి ఆహ్వానాలు పంపింది. చాలా మంది ప్రముఖులు సదస్సుకు వచ్చేందుకు అంగీకరించారు. 2 వేల మందికిపైగా అతిథులు వస్తారని సర్కారు అంచనా వేస్తోంది. కా గా ఫ్యూచర్ సిటీలో 70 ఎకరాల విస్తీర్ణంలో వరల్ ట్రేడ్ సెంటర్ నిర్మించే ఛాన్స్ ఉంది.
ఈ సదస్సుకు గౌతమ్ అదానీ, అనంత్ అంబానీ, ఎరిక్ స్త్వ్రడర్ ఆనంద్ మహీంద్రా వంటి వారు కూడా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పె ట్టేందుకు పలు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. విద్య, నైపుణ్య,క్రీడా, పర్యాటక, పరిశ్రమ రంగాల్లో ప్రభుత్వంతో సుమారు 90కి పైగా పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 8, 9 న జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రూ.వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకునేందుకు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా పెట్టుబడుల ఆకర్షణను కీలక అంశంగా ప్రభుత్వం పరిగణిస్తోంది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించేలా ప్రణాళికలు రచిస్తోంది. స్థిరమైన విధానాలు, ప్రపంచస్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, వ్యాపార సౌలభ్యం, బలోపేతమైన ఆవిష్కరణ వ్యవస్థలు అన్నింటికి మించి మెరుగైన జీవన నాణ్యత ఈ ఐదు అంశాలు ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను మార్చాయనే విషయాన్ని సదస్సులో సర్కార్ ప్రస్తావించనుంది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులకు ఇప్పటికే 50 కంపెనీలు సంసిద్ధత తెలిపాయి.
పలు సంస్థలతో ఒప్పందాలు
ఫ్యూచర్ సిటీలో రూ.3 వేల కోట్లతో 3 హోటళ్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ కన్వెన్షన్‌ను నిర్మించనున్న ఫుడ్ లింక్ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్-ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. వంతారా రిలయన్స్ గ్రూప్‌తో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నైట్ సఫారీపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అజయ్ దేవగన్‌తో ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై ఒప్పందం, ఐఐఎఫ్‌ఏతో ఫిల్మ్ ఇన్ తెలంగాణ కార్యక్రమంలో భాగస్వామ్యం, టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ తో పర్యాటక శాఖ పీఎంయూ స్థాపన ఒప్పందం చేసుకోనున్నారు. బౌద్ధ పర్యాటక సర్క్యూట్ ప్రోత్సాహంపై ఏసియన్ రాయబారులతో, కొత్వాల్ గూడలో ఆర్టిఫిషియల్ బీచ్‌పై స్పెయిన్‌కు చెందిన పూయిడ్రాతో ఒప్పందం చేసుకోనున్నారు. రూ.850 కోట్లతో ఫ్యూచర్ సిటీలో అర్బన్ బీచ్‌తో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్
హబ్ కోసం యూఎస్‌ఏకు చెందిన క్రిస్టల్ లగూన్స్ అండ్ గ్రీన్ పాంథర్స్ ప్రాపర్టీస్ లిమిటెడ్‌తో ఎంవోయూ కుదుర్చుకోనుంది. రూ.70 వేల కోట్లతో హైపర్ వాల్ట్ డేటా సెంటర్ల ఏర్పాటుపై టీసీఎస్-టీపీజీతో సర్కార్ ఒప్పందం చేసుకోనుంది. రూ.850 కోట్లతో ఏఐ కార్యక్రమాలు, డేటా సెంటర్లకు అక్విలోన్ నెక్సస్ లిమిటెడ్ అండ్ నార్త్‌స్టార్ ఆపర్చునిటీస్ ఫండ్‌తో అవగాహన కుదుర్చుకోనున్నారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ విస్తరణకు చందన్‌పల్లిలో భూమి కేటాయించనున్నారు. రూ.8 వేల కోట్లతో జహీరాబాద్‌లో హ్యుండాయ్ టెస్ట్ ట్రాక్, తయారీ ప్లాంట్‌తో పాటు రూ.400 కోట్లతో ప్లాంట్ల విస్తరణకు మహీంద్రా అండ్ మహీంద్రాతో ఒప్పందం చేసుకోనున్నారు. ఫాక్స్‌కాన్‌తో ఫిట్ పేజీ -2 విస్తరణ ఒప్పందం చేసుకోనున్నారు. రూ.1500 కోట్లతో ఎంఎస్‌ఎన్, రూ.200 కోట్లతో బయోలాజికల్-ఈ తో పరిశోధన అభివృద్ధి హబ్‌ల ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకోనుంది. లులు-హైపర్‌తో విమానాశ్రయానికి సమీపంలో లులు హైపర్ మాల్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
పెట్టుబడులకు ప్రముఖ కంపెనీల ఆసక్తి
రూ.150 కోట్లతో హౌజింగ్ ఎక్విప్ తయారీ ప్లాంటుకు జపాన్‌కు చెందిన లిక్సిల్ గ్రూప్‌తో అవగాహన ఒప్పందాన్ని సర్కార్ కుదుర్చుకోనుంది. టీసీసీఐతో కొంగరకలాన్ సమీపంలోని తైవాన్ మినీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఎంవోయూ చేసుకోనున్నారు. సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్‌తో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్కు, ట్రంప్ మీడియా అండ్ టెక్ గ్రూప్ బీ టెక్స్‌తో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఆల్ట్ మిన్‌తో ఎస్‌సీసీఎల్, కబిల్ భాగస్వామ్యంతో దేశంలోనే తొలి లిథియం రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. మొత్తం 250 మిలియన్ల అమెరికన్ డాలర్లు ఫేజ్-1లో 50 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేలా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కానుంది. రూ.4 వేల కోట్లతో నేపియర్ గడ్డి ఆధారంగా చేసుకునే 25 సీబీజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అధిరాథ్ హోల్డింగ్స్‌తో ఒప్పందం చేసుకోనున్నారు. హార్ట్ ఫోర్డ్ ఇన్సూరెన్స్, జురిచ్ ఇన్సూరెన్స్, నెట్‌ఫ్లిక్స్, ఎల్-ఓరియల్ ఓఎస్‌ఎఫ్ డిజిటల్ జీసీసీల ఏర్పాటుకు అవగాహన కుదరనుంది. రూ.350 కోట్లతో సనౌఫీ జీసీసీ విస్తరణతో పాటు పంచ్ ఏఐ ఆధ్వర్యంలో
ఏఐ టెక్ సెంటర్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకోనున్నారు. టామ్‌కామ్‌తో కలిసి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జర్మనీకి చెందిన నెక్స్‌వేవ్ మొబిలిటీ, తైవాన్ నియామకాలు, అపోలో మెడ్‌స్కిల్స్‌తో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు చేసేలా యూనివర్సిటీ ఆఫ్ లండన్‌తో ఒప్పందం జరగనుంది. దుబాయ్ జీఎంఆర్ స్పోర్ట్ వెంచర్స్‌తో ఫ్యూచర్ సిటీ శాటిలైట్ స్పోరట్స్ సిటీ అభివృద్ధికి అవగాహన కుదుర్చుకోనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఫిఫా ఐఎఫ్‌తో మహిళల ఫుట్‌బాల్ అకాడమీ, పురుషుల ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ప్రధాన క్రీడా టోర్నమెంట్ల నిర్వహణపై సదస్సులో ప్రకటన చేయనున్నారు. సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ ఫండ్‌ను ఆవిష్కరించనున్నారు. దేశ తొలి సమగ్ర తారామండల్ ఆర్బిటల్ వాహన వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. బ్లూ ఎర్త్ క్లైమెట్ తో కలిపి నెట్ జీరో ప్రాజెక్ట్ పెట్టనున్నారు. స్టెప్తో స్కూల్ ఆఫ్ టూరిజం కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
సెల్ ఫోన్ సిగ్నల్స్ కోసం టవర్స్ ఏర్పాటు
సుమారు 3 వేల మంది దేశ, విదేశీ అతిథులు ఈ సదస్సుకు హాజరు అవుతారని అంచనా. సీఎం, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఇతర సేవలందించే వారిని కలుపుకుంటే సుమారు 5 వేల మంది వరకు ప్రాంగణం లోపల, బయట ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరందరికీ సెల్ ఫోన్ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు సెల్ టవర్ ఆన్ వీల్స్ విధానంలో బీఎస్‌ఎన్‌ఎల్, జియో, వొడాఫోన్, ఎయిర్‌టెల్ తదితర నెట్‌వర్క్‌ల టవర్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మొబైల్ నెట్‌వర్క్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వంద ఎకరాల్లో భారీ ఏర్పాట్లు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వంద ఎకరాల్లో ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. యాభై ఎకరాల్లో పార్కింగ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ఒకవేదికపై ప్రతినిధులు ప్రసంగించడానికి, మరొక వేదికను తెలంగాణ సాంస్కృతిక కళాకారులు విభిన్న ప్రదర్శనలు చేయనున్నారు. వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలు చర్చించుకోవడానికి ప్రత్యేక లాంజ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించనుంది.