వైజాగ్: దక్షిణాఫ్రికాతో మూడో చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో 271 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్ల రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. అయితే, కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో రోహిత్ భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. అనంతరం విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా 27 ఓవర్లలో వికెట్ నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్(74), కోహ్లీ(2)లు ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 109 పరుగులు చేయాల్సి ఉంది.
అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ డికాక్ మాత్రం 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 106 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ బవుమా 48 పరుగులు, బ్రెవిస్ 29 పరుగులు, మహరాజ్ (నాటౌట్) 20 పరుగులు, యాన్సెన్ 17 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో కుల్దీప్, ప్రశిద్ధ్ చెరి నాలుగు, అర్ష్‌దీప్, జడేజా తలో వికెట్ తీశారు.