మన తెలంగాణ/నర్సంపేట: జూబ్లీహిల్స్ ఉప ఎ న్నికను రెఫరెండంగా ప్రకటించిన వారిని ఓటర్లు బండకేసి కొట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్ప ష్టం చేశారు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో ఓ టమిపాలవుతున్నా జనంలో తిరుగుతున్నారని ఆక్షేపించారు. ‘రాష్ట్ర ప్రజలంతా నాకు అండగా ఉండండి.. ఢిల్లీని ఢీకొడతా.. ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా.. కేంద్ర మంత్రులను కలిసి నిధులు తీసుకొ స్తా. నాకు వయస్సు ఉంది. ఓపిక ఉంది’ అని రే వంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా పాల న.. ప్రజా విజయోత్సవాల సభ వరంగల్ జిల్లా, నర్సంపేట పట్టణ కేంద్రంలో శుక్రవారం జరిగిం ది. ఈ సందర్భంగా సుమారు రూ.508.84 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభకు నర్సంపేట ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, పలువురు ఎంఎల్‌ఎ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సిఎం మాట్లాడుతూ.. 2023, డిసెంబరు 3న గడిల పాలనను బద్దలుకొట్టి ఓటు అనే ఆయుధంతో ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలను జరుపుకుంటున్నామని అన్నారు. తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయి.. అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశించగా తెలంగాణ రావడంతో వాళ్ల ఆస్తులు పెరిగాయి.. ఫాంహౌస్‌లు కట్టుకున్నారు. హెలికాఫ్టర్లు కొనుక్కున్నారని పరోక్షంగా గత పాలకులను ఉద్దేశించి తీవ్రంగా ఆరోపించారు. గత ముఖ్యమంత్రి వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని, రైతులకు ఉరే అని మీ దిక్కున్నచోట చెప్పుకోమంటే..తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గింజ లేకుండా సన్న వడ్లు కొనుగోలు చేసి రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ వస్తే రైతులకు 24 గంటలు కరంటు ఉండదన్న వారి గడీల్లో కరంటు లేకుండా పోయి రైతులకు 24 గంటల కరంటు ఇస్తున్నామన్నారు.
2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత విద్యుత్‌ను అమలుచేశారని, ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్‌దేనని అన్నారు. ఎకరాకు గత ప్రభుత్వం రైతు బంధు రూ.10 వేలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.12 వేలు ఇచ్చి రైతులకు భరోసా ఇచ్చిందన్నారు. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు రూ.20.614 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. దేశంలోనే అత్యధిక శాతం ధాన్యం పండిస్తున్నది తెలంగాణ రాష్ట్రమని, మన దగ్గర పండిన 56 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశామన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని ప్రతీ గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకుంటున్నామని అన్నారు.రాష్ట్రంలో గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చిన దిక్కులేదని కాంగ్రెస్ ప్రభుత్వం 1.10 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే ఏ ఒక్కరూ అవి తినకుండా మళ్లీ రేషన్ షాపు డీలర్‌కే అమ్ముకొని రీసైక్లింగ్ చేసుకొనేవారని అన్నారు. తాము అలా కాకుండా ప్రతీ పేద వాడు సన్న బియ్యం తినాలని 3.10 కోట్ల మంది ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్నామని అన్నారు. ఈ పథకం వల్ల సంవత్సరానికి రూ.13 కోట్లు భారం అయినప్పటికీ పేదల శ్రేయస్సు కోసం భరిస్తున్నామని అన్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఉండని గ్రామం లేదు
రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా హనుమాన్ గుడి లేని గ్రామం ఉండదని.. కానీ ఇందిరమ్మ ఇల్లు ఉండని గ్రామం లేదన్నారు. తెలంగాణలో ప్రతీ నియోజకవర్గానికి గూడు కల్పించాలనే లక్షంతో 3,500 ఇళ్లు మంజూరు చేశామన్నారు. వచ్చే బడ్జెట్‌లో నర్సంపేట నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాను గత ప్రభుత్వం అభివృద్ధిలో పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణలో కనీసం రెండో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా గత ప్రభుత్వం చేయలేదని వ్యాఖ్యానించారు. గత కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుచేసిందన్నారు. హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలని, మామునూరులో ఎయిర్‌పోర్టు, నగరంలో అండర్ డ్రైనేజీ, ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. మార్చి 31 వరకు వరంగల్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభించబోతున్నామని అన్నారు. తెలంగాణలో కోటి మంది మహిళలకు పుట్టింటి సారె ఇవ్వాలనే లక్షంతో
ఓ అన్నలా ప్రతీ ఆడబిడ్డకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఇప్పటివరకు 65 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ జరిగిందని, కొన్ని గ్రామాల్లో ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీ చేయలేదని, ఎన్నికల అనంతరం వాటిని పూర్తి చేస్తామన్నారు. పట్టణాల్లోని మహిళల్లో 35 వేల మందికి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మహిళలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, ప్రతీ ఒక్కరూ విద్యపై దృష్టి ఉంచి ఐఏఎస్, ఐపిఎస్, ఇంజినీర్లుగా, డాక్టర్లుగా రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కోరారు. పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేకంగా విద్యపైనే దృష్టి పెట్టాలని చదువుతోనే జీవితంలో మార్పు వస్తుందని, విద్యారంగం ముందుకెళ్లడానికి బాధ్యత తనదే అన్నారు.
త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీ
తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 61 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నిరుద్యోగ యువత పోటీపడి ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలను సాధించాలని సూచించారు. గ్రామాల్లో జరిగే ఎన్నికలపై యువత దృష్టి పెట్టవద్దని.. ఎన్నికల్లో ఎప్పుడైనా పోటీ చేయవచ్చని ప్రభుత్వ ఉద్యోగానికి మాత్రం వయస్సుతో ముడిపడి ఉంటుందన్నారు. విద్యతోనే అన్ని రంగాల్లో రాణించవచ్చని అందుకు తాను, ఇక్కడున్న మంత్రులు సీతక్క, సురేఖ ఉదాహరణ అన్నారు.
స్థానిక ఎన్నికల్లో ప్రజల మనస్సులు గెలుచుకోండి
స్థానిక ఎన్నికల్లో ప్రజల మనస్సులు గెలుచుకోండి. పైసలు ఖర్చు పెట్టకండి గ్రామాభివృద్ధే లక్షంగా ఎవరైతే గ్రామంలో సమస్యల పరిష్కారానికి మంత్రి వద్దకు వెళ్లి కృషిచేసే అవకాశాలున్న వ్యక్తులను ఎంచుకొని వారిని గెలిపించుకోవాల అన్నారు. ‘మీరు ఎన్నుకోబోయే సర్పంచ్ ప్రభుత్వ పథకాలను సాధించగలిగే వ్యక్తి కావాలని.. మహిళలకు ఎవరికైతే ఇందిరమ్మ చీరలు రావో వారికి కూడా ఇందిరమ్మ చీరల పంపిణీ చేసే బాధ్యత ఆ గ్రామ సర్పంచ్‌దే’ అని స్పష్టం చేశారు. జనవరిలో మేడారం జాతరకు వచ్చి తల్లులను దర్శించుకుంటానని తెలిపారు. ఈ సభలో మహబూబాబాద్ ఎంపి పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, రామచంద్రునాయక్, ఎంఎల్‌సి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.