వైజాగ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ శతకం నమోదు చేశాడు. 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ అందుకున్నాడు. జైస్వాల్ కు వన్డేలో ఇది తొలి సెంచరీ. అంతకుముందు మరో ఓపెనర్ రోహిత్ శర్మ 75 పరుగులతో రాణించారు. రోహిత్, జైస్వాల్ కలిసి తొలి వికెట్ కు 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ప్రస్తుతం టీమిండియా 36 ఓవర్లలో వికెట్ నష్టానికి 221 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్(100), కోహ్లీ(33)లు ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 50 పరుగులు చేయాల్సి ఉంది.