గ్రేటర్ హైదరాబాద్ విస్తరణలో భాగంగా బడంగ్పేట్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు శనివారం మహాధర్నా నిర్వహించారు. ‘బడంగ్పేట్ బచావో’పేరిట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపి విశ్వేశ్వర్‌రెడ్డి మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఎంఐఎం పార్టీ మెప్పుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఎంపి విశ్వేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు.మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని బడంగ్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్‌ను చార్మినార్ జోన్లో విలీనం చేయోద్దని, ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మహేశ్వరం బిజెపి ఇన్చార్జీ అందెల శ్రీరాములు, కార్పోరేషన్ బిజెపి అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డిలతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.