యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ ’సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సహకారంతో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలిం గ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా నుంచి ధుమ్ ఠకుమ్ సాంగ్ లాంచ్ చేశారు.
ఈ ఈవెంట్ లో నిర్మాత సురేష్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ “నందు, వరుణ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. రాఘవేంద్రరావుతో పాటు చాలా మందికి ఈ సినిమా చూపించాము. అందరు కూడా చాలా ప్రశంసించారు. పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం తర్వాత అంత స్పెషల్ ఎఫర్ట్ పెట్టి సినిమా ఇదనిపించింది”అని అన్నారు. హీరో శ్రీనందు మాట్లాడుతూ “సురేష్ బాబు ఎంతోమందిని హీరోలుగా చేశారు. ఆయన ఈ సినిమా కొన్న రోజు నా ఆనందానికి హద్దులు లేవు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ యామిని భాస్కర్, మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి తదితరులు పాల్గొన్నారు.